Monday 16 April 2018

సూక్తి-5 - అతిపరిచయాదవజ్ఞా


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-5


అతిపరిచయాదవజ్ఞా సంతతగమనాదనాదరో భవతి ।

మలయే భిల్లపురంధ్రీ చన్దనకాష్ఠమిన్ధనం కురుతే ॥5॥


తాత్పర్యము-

ఎక్కువ పరిచయం అవమానానికి హేతువు. మాటిమాటికి వెడుతూంటే అనాదరం ఏర్పడుతుంది. మలయ పర్వతం మీద నివసించే భిల్ల (బోయ) స్త్రీ మంచిగంధపు కఱ్ఱను వంట వండుకొనేందుకు కట్టెగా ఉపయోగిస్తుంది.


పదచ్చేదం : 
అతి పరిచయాత్ - అవజ్ఞా - సంతత గమనాత్ అనాదరః - భవతి - మలయే - భిల్ల పురంధ్రీ - చన్దన కాష్ఠమ్ - ఇన్దనం - కురుతే.

No comments:

Post a Comment