Wednesday 18 April 2018

సూక్తి-13 - అభిమానధనం యేషాం

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-13

అభిమానధనం యేషాం చిరం జీవన్తి తే నరాః ।
అభిమానవిహీనానాం కిం ధనేన కిమాయుషా ॥13॥

తాత్పర్యము-
ఆత్మాభిమానం అనే ధనం ఉన్నవాళ్ళే చిరకాలం జీవించినట్టు లెక్క. ఆత్మాభిమానం లేనివాళ్ళకు ధనం ఉంటే ప్రయోజనం? దీర్ఘాయుర్దాయం ఉంటే ఏమి ప్రయోజనం?

No comments:

Post a Comment