Monday 16 April 2018

సూక్తి-4 - అతిరూపాద్ధృతా


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-4


అతిరూపాద్ధృతా సీతాతిగర్వాద్రావణో హతః ।

అతిదానాద్బలిర్బద్ధో హ్యతి సర్వత్ర వర్జయేత్ ॥4॥


తాత్పర్యము-

ఎక్కువ సౌందర్యం ఉండడం వల్ల సీత హరించబడింది. ఎక్కువ గర్వం మూలాన రావణుడు చంపబడ్డాడు. అతిగా దానం ఇవ్వడం వల్ల బలి బంధించబడ్డాడు. అందుచేత అన్నింటా అతిని విడిచి పెట్టాలి (దేనిలోనూ అతి పనికి రాదు).

పదచ్చేదం :
అతిరూపాత్ - దృతా - సీత - అతిగర్వాత్ - రావణః - హతః - అతిదానాత్ - బలిః - బద్దః -హి - అతి - సర్వత్ర - వర్జయేత్.

No comments:

Post a Comment