Saturday 21 April 2018

సూక్తి-51 - అశ్వప్లుతం మాఘవగర్జితం


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-51

అశ్వప్లుతం మాఘవగర్జితం చ స్త్రీణాం చ చిత్తం పురుషస్య భాగ్యమ్ ।
అవర్షణం చాప్యతివర్షణం చ దేవో న జానాతి కుతో మనుష్యః 51

తాత్పర్యము-
గుఱ్ఱపు నడకను, ఇంద్రుని (మేఘ) గర్జితాన్ని, స్త్రీల చిత్తాన్ని, పురుషుల భాగ్యాన్ని, వర్షించకపోవడాన్ని, అతివృష్టినీ దేవుడు కూడా తెలుసుకొనలేడు; మనుష్యుడెట్లు తెలుసుకొనకలుగుతాడు?

Friday 20 April 2018

సూక్తి-50 - అప్రియం పరుషం చాపి


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-50

అప్రియం పరుషం చాపి పరద్రోహం పరస్త్రియః ।
అధర్మమనృతం చైవ దూరాత్ర్పాజ్ఞో వివర్జయేత్ ॥50॥

తాత్పర్యము-
బుద్ధిమంతుడు అప్రియమైన మాటలను, పరుషవచనాన్ని, పరులకు ద్రోహమును, పరస్త్రీని, అధర్మాన్ని, అసత్యాన్ని దూరంగా విడిచిపెట్టాలి.

సూక్తి-49 - అధీత్య చతురో వేదాన్


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-49

అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాణ్యనేకశః ।
పరం తత్త్వం న జానాతి దర్వీ పాకరసానివ ॥49॥

తాత్పర్యము-
ఒక్కొక్కడు నాలుగు వేదాలూ, అన్ని ధర్మశాస్త్రాలూ చదివి కూడా, గరిటె వంటకాలలోని రుచులను గ్రహించలేనట్టు, పరతత్త్వాన్ని గ్రహించలేడు.