Friday 20 April 2018

సూక్తి-34 - అర్చకస్య తపోయోగాద్


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-34

అర్చకస్య తపోయోగాదర్చనస్యాతిశాయనాత్ ।
ఆభిరూప్యాచ్చ మూర్తీనాం దేవః సాన్నిధ్యమృచ్ఛతి ॥34॥

తాత్పర్యము-
అర్చకుని తపఃశక్తిచేత, అర్చన బాగా జరగడం చేత, విగ్రహాలు చక్కగా ఉండడం చేత దేవుడు వాటిలో ఉంటాడు.

No comments:

Post a Comment