Friday 20 April 2018

సూక్తి-44 - అధః పశ్యసి కిం వృద్ధే


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-44

అధః పశ్యసి కిం వృద్ధే తవ కిం పతితం భువి ।
రే రే మూఢ న జానాసి గతం తారుణ్యమౌక్తికమ్ ॥44॥

తాత్పర్యము-
వృద్ధురాలా! క్రింద చూస్తున్నావేమిటి? నీదేమైనా నేలమీద పడిపోయిందా? ఓరీ! మూర్ఖా! యౌవనం అనే ముత్యం జారి పడిపోయిందనే సంగతి తెలియదా?

No comments:

Post a Comment