Friday 20 April 2018

సూక్తి-21 - అఙ్కేషు శూన్యవిన్యాసాద్

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-21

అఙ్కేషు శూన్యవిన్యాసాద్ వృద్ధిః స్యాత్తు దశాధికా ।
తస్మాద్ జ్ఞేయా విశేషేణ అఙ్కానాం వామతో గతిః ॥21॥

తాత్పర్యము-
అంకె ప్రక్క సున్న ఉంచితే దాని విలువ పదేసి రెట్లు పెరుగుతుంది. అందుచేత అంకెలను లెక్క పెట్టేటప్పుడు కుడినుంచి ఎడమకు వెళ్ళాలి. 

          ఉదాహరణకు కొన్ని అంకెలు చెప్పడానికి సంస్కృతంలో కొన్ని సాంకేతికపదాలు వాడతారు. చంద్రుడు అంటే ఒకటి. సూర్యుడు = 2, బాణాలు= ఐదు, అగ్ని= 3 ఇత్యాదులు. ఎక్కడనైనా బాణాగ్నిచంద్ర" అని అన్నట్లయితే 5,3,1 అని అంకెలు వేసుకొని వాటిని కుడినుంచి ఎడమకు చదివితే 135 అవుతుంది.

No comments:

Post a Comment