Wednesday 16 March 2016

పరిచయం


సుభాషితం - సుష్ఠు భాషితం

     సంస్కృతం ఎంతో అందమైన భాష. ఆ దేవబాష అందమంతా సుభాషితాలలో ఉందంటే అతిశయోక్తి లేదు. సరళంగా, సుగమంగా చక్కని నీతిని, లోతైన భావాన్ని హాయిగా బోధించేది సుభాషితం. అది రామాయణంలోది కావచ్చు, మహాభారతంలోది కావచ్చు, లేదా హితోపదేశాది కథలలో కావ్యాలలో ఉండవచ్చు- దాని ప్రాశస్త్యం దానిది. గ్రంథమంతా ఒక ఎత్తు. సుభాషితం ఒక్కటి ఒక ఎత్తు.

      అటువంటి సంస్కృత సుభాషిత ఆణిముత్యాలను ఏరి, అకారాదిగా కూర్చి సులువైన తెలుగు అర్థంతో ప్రచురించినవారు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారి పేరు తెలుగునాట సంస్కృతాంధ్రపండితులలో అగ్రగణ్యం, సుప్రసిద్ధం. వారు రచించిన "సుభాషిత సూక్తిరత్నకోశః, ప్రథమమంజూష" (సంగ్రహంలో అచ్చులతో ప్రారంభమయ్యే సుభాషితాల యొక్క ప్రథమపంపుటం) నుండి శ్లోక తాత్పర్యాలను యథాతథంగా ఇక్కడ ఇవ్వటమైనది. తెలుగువారికోసం ఈ చిరుకానుక- ఆస్వాదించండి.