Wednesday, 18 April 2018

సూక్తి-12 - అపుత్రస్య గతిర్నాస్తి

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-12

అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ ।
తస్మాత్ పుత్రముఖం దృష్ట్వా పశ్చాద్భవతి తాపసః ॥12॥

తాత్పర్యము-
పుత్రులు లేనివానికి గతి లేదు. స్వర్గం అసలే లేదు. అందువలన పుత్రుని ముఖం చూచిన తరవాతనే తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళాలి.

సూక్తి-11 - అపుత్రస్య గృహం శూన్యం

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-11

అపుత్రస్య గృహం శూన్యం దిశః శూన్యాస్త్వబాన్ధవాః ।
మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్యా దరిద్రతా ॥11॥ 

తాత్పర్యము-
పుత్రులు లేనివాని ఇల్లు శూన్యం. బంధువులు లేని దిక్కులు శూన్యాలు. మూర్ఖుని హృదయం శూన్యం. దరిద్రునికి అంతా శూన్యమే.

Monday, 16 April 2018

సూక్తి-10 - అశ్వం నైవ గజం నైవ

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-10

అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ ।
అజాపుత్రం బలిం దద్యాద్దేవో దుర్బలఘాతకః ॥10॥

తాత్పర్యము-
గుఱ్ఱాన్ని కాదు, ఏనుగును కాదు, పెద్దపులిని కానే కాదు. మేకపిల్లను బలి ఇవ్వాలట, దేవుడు కూడా దుర్బలులనే చంపుతాడు.