Monday, 16 April 2018

సూక్తి-9 - అయుక్తం స్వామినో యుక్తం

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-9

అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషణమ్ ।
అమృతం రాహవే మృత్యుర్విషం శంకరభూషణమ్ ॥9॥

తాత్పర్యము-
యుక్తం కానిది కూడా ప్రభువుకు యుక్తమే! యుక్తమైనది కూడా నీచునికి (సామాన్యుని) దోషంగా పరిగణింపబడుతుంది. రాహువుకు అమృతం కూడా మృత్యుకారణం అయింది. శంకరునికి విషం కూడా కంఠంలో అలంకారం అయింది.

సూక్తి-8 - అర్థస్య పురుషో దాసో

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-8

అర్థస్య పురుషో దాసో దాసస్త్వర్థో న కస్యచిత్ ।
ఇతి సత్యం మహారాజ బద్ధోఽస్మ్యర్థేన కౌరవైః ॥8॥

తాత్పర్యము-
మహారాజా! పురుషుడు ధనానికి దాసుడు. కాని ధనం ఎవరికీ దాసుడు కాదు (దాస్యం చెయ్యదు)- అన్న మాట సత్యం. కౌరవులు నన్ను అర్థం చేత కట్టివేశారు.

సూక్తి-7 - అమృతం శిశిరే వహ్నిః

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-7

అమృతం శిశిరే వహ్నిరమృతం బాలభాషణమ్ ।
అమృతం స్వప్రియా భార్యా హ్యమృతం స్వామిగౌరవమ్ 7॥ 

తాత్పర్యము-
చలికాలంలో అగ్ని అమృతం. చంటిపిల్లల (వచ్చి రాని) మాటలు అమృతం. ప్రియురాలైన భార్య అమృతం. ప్రభువునుండి లభించిన గౌరవం అమృతం.